విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. సినిమా బాలేదని నెటిజన్స్ ప్రచారం చేశారు. ఈ నెగెటివ్ ప్రచారంపై చిత్ర యూనిట్ మాదాపూర్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read: Shubman Gill: మేం బరిలో ఉన్నప్పుడు.. ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదు! శుభ్‌మన్ గిల్ కౌంటర్
ఫ్యామిలీ స్టార్ చిత్ర యూనిట్ మాత్రమే కాకుండా.. హీరో విజయ్ దేవరకొండ సైతం పోలీసులను సంప్రదించి నెగెటివ్ ప్రచారంపై ఫిర్యాదు చేశారని ఓ ఫొటో బుధవారం నెట్టింట చక్కర్లు కొట్టింది. దీనిపై విజయ్ క్లారిటీ ఇచ్చారు. సినిమా నెగెటివ్ ప్రచారంపై తాను ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ‘సోషల్ మీడియా ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అది ఇప్పటి ఫొటో కాదు. కరోనా మహమ్మారి సమయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దిగినప్పటి. నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు’ అని విజయ్ తెలిపారు.