Vijay : తాళి కటెప్పుడు చేతులు వణికాయి..రష్మికకు అది మూడోసారి కాబట్టి కూల్‌గా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్య. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, వీరిద్దరి గురించి ఒక ఆసక్తికరమైన పాత ముచ్చట ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఏడేళ్ల క్రితం ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి విజయ్ ఎంతగా టెన్షన్ పడ్డారో స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇప్పుడు అదే జంట నిజ జీవితంలో ఒక్కటవ్వడంతో ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. వరుసగా చేజారుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్?
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
2018లో ‘గీత గోవిందం’ ప్రమోషన్ల సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమాలో పెళ్లి సీన్ చిత్రీకరించేటప్పుడు నాకు నిజంగానే భయం వేసింది. చుట్టూ మంటపం, పట్టుబట్టలు, ఆ వాతావరణం అంతా చూస్తుంటే నిజంగానే పెళ్లి జరుగుతోందేమో అనిపించింది. రష్మికకు ఆ మూడు ముళ్లు వేసేటప్పుడు నా చేతులు వణికాయి. కానీ రష్మికకు అది సినిమాల్లో మూడో పెళ్లి కావడంతో తను చాలా కూల్‌గా ఉంది. తనే నాకు ధైర్యం చెప్పింది’ అని సరదాగా గుర్తుచేసుకున్నారు. కట్ చేస్తే.. ఏడేళ్ల తర్వాత అదే రష్మికకు విజయ్ నిజంగానే మూడు ముళ్లు వేసి తన ఇంటి మహాలక్ష్మిగా ఆహ్వానించారు. వివాహం అనంతరం విజయ్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా భార్య అయింది. తను పక్కన ఉంటేనే నాకు ప్రశాంతత. ఎక్కడున్నా నా ఇల్లు రష్మికే’ అని తన ప్రేమను చాటుకున్నారు. అటు రష్మిక కూడా ‘నిజమైన ప్రేమను నాకు చూపించిన వ్యక్తి నా భర్త విజయ్’ అంటూ మురిసిపోయింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!