Site icon NTV Telugu

Vijay Deverakonda :తాళి కటెప్పుడు చేతులు వణికాయి.. రష్మికకు అది మూడోసారి కాబట్టి కూల్‌గా ఉంది..

Vijay Rashmika Mandana

Vijay Rashmika Mandana

టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్య. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, వీరిద్దరి గురించి ఒక ఆసక్తికరమైన పాత ముచ్చట ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఏడేళ్ల క్రితం ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి విజయ్ ఎంతగా టెన్షన్ పడ్డారో స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇప్పుడు అదే జంట నిజ జీవితంలో ఒక్కటవ్వడంతో ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. వరుసగా చేజారుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్?

2018లో ‘గీత గోవిందం’ ప్రమోషన్ల సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమాలో పెళ్లి సీన్ చిత్రీకరించేటప్పుడు నాకు నిజంగానే భయం వేసింది. చుట్టూ మంటపం, పట్టుబట్టలు, ఆ వాతావరణం అంతా చూస్తుంటే నిజంగానే పెళ్లి జరుగుతోందేమో అనిపించింది. రష్మికకు ఆ మూడు ముళ్లు వేసేటప్పుడు నా చేతులు వణికాయి. కానీ రష్మికకు అది సినిమాల్లో మూడో పెళ్లి కావడంతో తను చాలా కూల్‌గా ఉంది. తనే నాకు ధైర్యం చెప్పింది’ అని సరదాగా గుర్తుచేసుకున్నారు. కట్ చేస్తే.. ఏడేళ్ల తర్వాత అదే రష్మికకు విజయ్ నిజంగానే మూడు ముళ్లు వేసి తన ఇంటి మహాలక్ష్మిగా ఆహ్వానించారు. వివాహం అనంతరం విజయ్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా భార్య అయింది. తను పక్కన ఉంటేనే నాకు ప్రశాంతత. ఎక్కడున్నా నా ఇల్లు రష్మికే’ అని తన ప్రేమను చాటుకున్నారు. అటు రష్మిక కూడా ‘నిజమైన ప్రేమను నాకు చూపించిన వ్యక్తి నా భర్త విజయ్’ అంటూ మురిసిపోయింది.

Exit mobile version