Site icon NTV Telugu

Ranabali Glimpse: విజయ్ – రశ్మిక హ్యాట్రిక్ సినిమా షురూ.. ‘రణబాలి’ గ్లింప్స్ చూశారా!

Ranabali

Ranabali

Ranabali Glimpse: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు “రణబాలి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

READ ALSO: Canada: కెనడాకు తత్వం బోధపడింది.. భారత్ రాబోతున్న ఆ దేశ ప్రధాని..

ఈ సినిమా గ్లింప్స్‌లో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన మాతృభూమి కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడే రణబాలి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. హీరోయిన్ రశ్మిక మందన్న జయమ్మగా కనిపించింది. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ‘మమ్మీ’ సినిమా ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. పచ్చటి పైరులతో అలరారే మన గ్రామసీమలను బ్రిటీష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లింప్స్ లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మారణహోమాన్ని బ్రిటీషర్స్ ఎలా సృష్టించారో గ్లింప్స్ రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటీష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్‌పై రణబాలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.

19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత “రణబాలి”లో మూడోసారి రశ్మిక- విజయ్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై విజయ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

READ ALSO: Rape Case: క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు..

Exit mobile version