Rashmika: ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన క్రేజీ కపుల్!.. రష్మిక పోస్ట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంట ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అనంతరం హైదరాబాద్, విజయ్ సొంత గ్రామంలో ఘనంగా వేడుకలు సైతం నిర్వహించారు. ఇటీవల ఈ కొత్త జంట అత్యంత సన్నిహితులతో బడ్డీమూన్‌కు సైతం వెళ్లింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే.. తాజాగా రష్మిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఓ క్యూట్ వీడియోను షేర్ చేసిన రష్మిక.. “ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” (Now we are three) అని క్యాప్షన్‌లో పేర్కొంది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియో ఒక యానిమేషన్ వీడియో. ఇందులో విజయ్, రష్మికలతో పాటు ఒక పొద్దుతిరుగుడు పువ్వు ఉంది. రష్మిక ధరించిన టీ-షర్ట్‌పై గుడ్డు బొమ్మ ఉండటం విశేషం. ఈ స్మాల్ వీడియో క్లిప్ ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.
READ MORE: Trump: ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. ఇటీవల తన ప్రేమ ప్రయాణం, పెళ్లి గురించి ఒక నెటిజన్ రాసిన కథనంపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యింది. తన బ్లాగ్‌లో ఒక అభిమాని వీరిద్దరి కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి ఎంతో హృద్యంగా వివరించారు. దీనిపై స్పందించిన రష్మిక.. “చాలా రోజుల తర్వాత నా గురించి రాసిన ఒక ఆర్టికల్ చదివి కళ్లు చెమర్చాయి. చెప్పాలని చాలా ఉంది కానీ మాటలు రావడం లేదు. నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ఈ ప్రయాణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా భావాలను ఇంత అందంగా గుర్తించి రాసినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేనొకటే చెబుతాను.. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి.” అని రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..