Site icon NTV Telugu

Power Star Movie : పవర్ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ.. వాస్తవం ఇదే

Vijay Pawan Kalyan

Vijay Pawan Kalyan

పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.  పవర్ స్టార్ కు తమ్ముడిగా విజయ్ కనిపిస్తాడని వార్తలు హల్ చల్ చేసాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంతని ఆరా తీయగా తాజా సమాచారం ప్రకారం విజయ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని తెలిసింది.

Also Read : Peddi Song : మెగా పవర్ స్టార్ ‘పెద్ది’.. సెకండ్ సింగిల్ డేట్ లాక్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌ లో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ నాలుగు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రౌడీ జనార్దన రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సెట్స్ పై ఉంది.  రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పిరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి కూడా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉండటంతో, విజయ్ తన సమయాన్ని పూర్తిగా వాటికే కేటాయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సినిమాకు, అది కూడా ఒక క్రేజీ మల్టీస్టారర్ లేదా అతిథి పాత్రకు డేట్స్ సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యం. పవన్ సినిమా కోసం విజయ్‌ను సంప్రదించారనే వార్త కేవలం పుకారు మాత్రమేనని, ఆయన తన సొంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారని స్పష్టమవుతోంది. పవన్ – విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని ఆశించిన అభిమానులకు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, విజయ్ చేస్తున్న సోలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను కలిగి ఉన్నాయి.

Exit mobile version