NTV Telugu Site icon

Family Star: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. ర‌న్‌టైం ఎంతంటే?

Family Star

Family Star

Vijay Deverakonda’s Family Star Movie Run Time: పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌మోష‌న్స్ మొద‌లెట్టారు. ఇప్ప‌టికే ఫ్యామిలీ స్టార్‌ నుంచి వచ్చిన టీజ‌ర్‌, సాంగ్స్, ట్రైల‌ర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు స‌భ్యులు ఫ్యామిలీ స్టార్‌ సినిమాకు ‘యు/ఏ’ స‌ర్టిఫికేట్‌ ఇచ్చారు. ఈ మూవీ ర‌న్‌టైం 150 నిమిషాలు ఉన్న‌ట్లు చిత్ర‌ యూనిట్ సోషల్ మీడియాలో తెలిపింది. ‘ఈ వేసవిలో వేడుకలు చేసుకుందాం. మీ ఫ్యామిలీ స్టార్‌ 150 నిమిషాల సంపూర్ణ వినోదంతో వస్తోంది. రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి’ అని శ్రేయాస్ మీడియా ఎక్స్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా 2.30 గంటలు పూర్తి వినోదాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Also Read: Sridevi Biopic: నేను బతికుండగా.. శ్రీదేవి బయోపిక్‌కు అనుమతివ్వను: బోనీ

గీత గోవిందం తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. విజయ్‌ నటన, పరశురామ్ టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న అతిథి పాత్రలో నటించగా.. దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రష్మిక పాత్ర ఏంటనేది ఇంకా తెలియరాలేదు.