టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. డైరెక్టర్ రవికిరణ్ కోలాతో విజయ్ ఈ సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ దిల్ రాజు మరోసారి విజయ్‌తో కలిసి పని చేస్తున్నారు.. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా సినిమాను అనౌన్స్ చేశారు.. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది..
ఈ యాక్షన్ డ్రామాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కొండన్న తో రొమాన్స్ చేయబోతుందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ పాత్రకి సాయి పల్లవి అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని డైరెక్టర్ బలంగా నమ్ముతున్నారు. అందులోనూ సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకునే ఈ క్యారెక్టర్‌ను రాశారట డైరెక్టర్.. ఈ పాత్రకు సినిమాలో ఎక్కువగా స్కోఫ్ ఉన్నట్లు తెలుస్తుంది.. అందుకే ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది..
సాయి పల్లవి దిల్ రాజు నిర్మాణంలో ఫిదా, ఎంసీఏ సినిమాల్లో నటించింది. కాబట్టి ఈ చిత్రానికి సాయి పల్లవిని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదని అనుకుంటున్నారు.. సాయి పల్లవి ఇప్పటివరకు ఎప్పుడు విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.. బేసిగ్గా అమ్మడు రొమాన్స్ కు కాస్త దూరంగా ఉంటుంది.. సాయి పల్లవి ఇలాంటి సన్నివేశాల్లో అస్సలు నటించదు. ఇప్పుడు ఇదే రౌడీ ఫ్యాన్స్‌ని కాస్త టెన్షన్ పెడుతుంది.. మరి ఆమెకు తగ్గట్లు సీన్స్ ఉంటాయో లేక ఏదైన మ్యాజిక్ చేస్తారో చూడాలి.. ఏది ఏమైనా ఈ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..