Vijay Deverakonda: దేవరకొండ మార్కు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda: తెలుగు సినిమా పరిశ్రమలో ఆన్‌లైన్ దాడులు, రేటింగ్‌ల రచ్చ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు సంక్రాంతి విడుదల సందర్భంగా బుక్ మై షోలో రేటింగ్‌లను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ కావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ దీనిపై తన మార్కు కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Anil Ravipudi: విజయ్ ‘జన నాయగన్’ సినిమాపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
Also Read
‘ఇది పరిశ్రమ కష్టానికి రక్షణ కవచమే అయినా, మనలోని విభేదాలు ఇలాంటి దాడులకు కారణమవుతున్నాయి’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సుదీర్ఘ పోస్ట్‌లో..’సినిమాలపై ఇలాంటి దాడులు పరిశ్రమ సహకార భావాన్ని దెబ్బతీస్తున్నాయి. 2019లో విడుదలైన తన ‘డియర్ కామ్రేడ్’ సినిమా నుంచే ఇలాంటి కోఆర్డినేటెడ్ బ్యాక్‌లాష్‌ను ఎదుర్కొన్నానని చెప్పారు. ‘ఆ సమయంలో మొదలైన ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు పెద్ద సినిమాలపై కూడా ఇది ప్రభావం చూపుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.
కోర్టు ఆదేశం అనేది సంక్రాంతి రిలీజ్‌లకు కొంత ఒత్తిడిని తగ్గిస్తుందని, అయితే ఇది సమస్యలను పూర్తిగా పరిష్కరించదని చెప్పారు. ‘లివ్ అండ్ లెట్ లివ్’ (బతకనివ్వు, బతకనిచ్చు) అనే సంస్కృతిని పరిశ్రమలో పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఆన్‌లైన్ సబోటేజ్ ఒక కొత్త సమస్య కాదు. గత కొన్నేళ్లుగా సినిమా విడుదల సమయంలో ఇలాంటి నెగెటివ్ రివ్యూలు, ఫేక్ రేటింగ్‌లు పెరిగిపోతున్నాయి. ఇవి సినిమా బాక్సాఫీస్ పనితీరును ప్రభావితం చేస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి దాడులను విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలు ఎన్నో ఎదుర్కొన్నారు. ఇప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాలకు కూడా ఇది వ్యాపించడం పరిశ్రమకు హెచ్చరిక గంటలా మోగుతోందని చెబుతున్నారు.
కోర్టు ఆదేశం ఒకవైపు సినిమా నిర్మాతలకు ఊరటనిస్తూనే, మరోవైపు పరిశ్రమలోని అంతర్గత విభేదాలను బయటపెడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ‘మనమంతా ఒకే ఫ్యామిలీ’ అనే భావనను బలోపేతం చేయాల్సిన సమయమిది అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పోస్ట్ సినిమా ప్రేమికుల్లో చర్చ రేపుతోంది.
READ ALSO: Iran Protests: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?