NTV Telugu Site icon

Vijay Deverakonda: నా వల్లే నాగ్‌ అశ్విన్‌ సినిమాలు ఆడటం లేదు: విజయ్‌

Vijay Deverakonda Kalki

Vijay Deverakonda Kalki

Vijay Deverakonda About His Character in Kalki 2898 AD: నాగ్‌ అశ్విన్‌ ప్రతి సినిమాలో తాను చేయడం అతడి లక్కీఛార్మ్‌ అని చెప్పొచ్చు కానీ.. సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయని హీరో విజయ్‌ దేవరకొండ తెలిపారు. తాను నటించడం వల్లే నాగీ సినిమాలు ఆడటం లేదన్నారు. ‘కల్కి 2898 ఏడీ’తో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లను టచ్ చేసింది.

కల్కి 2898 ఏడీలో అర్జునుడి పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్‌ తన పాత్ర గురించి మాట్లాడారు. ‘కల్కి సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. కల్కితో ఇండియన్‌ సినిమా మరో స్థాయికి వెళ్లింది. నాగ్‌ అశ్విన్‌, ప్రభాస్‌ అన్న గురించి ఈ పాత్ర చేశాను. అర్జునుడిగా సినిమా చివరిలో కనిపించడం, ఆ పాత్ర చేయడం సంతోషంగా ఉంది. తెరపై విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అన్నట్లు అస్సలు చూడొద్దు. ప్రభాస్‌ను కర్ణుడిగా, నన్ను అర్జునుడిగా చూడాలి’ అని అన్నారు.

Also Read: New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..

‘నాగ్‌ అశ్విన్‌ యూనివర్స్‌లో మేము పాత్రలు చేస్తున్నాం. నాగీ ప్రతి సినిమాలో నేను చేయడం తన లక్కీఛార్మ్‌ అని చెప్పొచ్చు. అతడి సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి. నేను చేయడం వల్లే నాగీ సినిమాలు ఆడటం లేదు. మహానటి, కల్కి రెండూ గొప్ప సినిమాలు. అందులో మేం నటించామంతే’ అని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. కల్కి పార్ట్‌-2లో విజయ్‌ పాత్ర ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నాగీ తీసిన ఏవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి చిత్రాల్లో విజయ్‌ నటించిన విషయం తెలిసిందే.