Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Deverakonda: ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మొదటి సక్సెస్‌ను అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో చేసిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన ‘గీత గోవిందం’ మూవీతో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. నిజానికి ఈ మూవీ తర్వాత విజయ్‌కి సరైన సక్సెస్ రావడం లేదు. రీసెంట్‌గా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేసిన ‘రణబాలి’ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు. ప్రస్తుతం తెలుగులో ఆరుగురు మాత్రమే టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. మరికొంత మంది టైర్ వన్ హీరోల లిస్టులోకి చేరాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది వర్కౌట్ కావడం లేదు. విజయ్ దేవరకొండ గత కొన్ని సంవత్సరాలుగా ఒక్క భారీ హిట్ కొట్టి టైర్ వన్ హీరోల లిస్ట్‌లోకి చేరాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, ఆ హిట్ కొట్టలేకపోతున్నాడు. గత ఏడాది ‘కింగ్ డమ్’ మూవీతో సత్తా చాటాలనుకున్నాడు. కానీ, ఆ మూవీ ప్రేక్షకులకు నచ్చలేదు. కథలోనే లాజిక్స్ మిస్ అవ్వడం, స్క్రీన్ ప్లే రొటీన్ టెంప్లేట్‌లో ఉండటం, నేరేషన్ స్లో అవ్వడంతో సినిమా పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. అలానే రణబాలి సినిమా కూడా బానే ఆడింది కానీ ఎక్కడో వెలితి.

ఇప్పుడు రాజ్ కిరణ్ కోలా డైరెక్షన్‌లో చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ భారీ విజయాన్ని అందుకుంటే విజయ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతాడు. లేకపోతే ఆయన మీడియం రేంజ్ హీరోగానే మిగిలే అవకాశం ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో, ముఖ్యంగా ‘లైగర్’ సినిమా సమయంలో విజయ్ మాట్లాడిన మాటలు స్టార్ హీరోల అభిమానులను ఇబ్బంది పెట్టాయి. “మా తాత ఎవరో తెలీదు, మా నాన్న ఎవరో తెలియదు.. అయినా కూడా నాకోసం ఇంత మంది వచ్చారు” అంటూ ఆయన చేసిన కామెంట్స్ స్టార్ హీరోల అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు సైతం కొంచెం ఓవర్‌గా అనిపించడంతో, ఆయన కొంతమంది అభిమానులను కోల్పోయాడు. కానీ, ఈ మధ్య చాలా పద్ధతిగా ఉంటూ తన గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. మొత్తానికైతే మరో భారీ సక్సెస్ కొట్టి గ్రాండ్‌గా టైర్ వన్ హీరోల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.