Site icon NTV Telugu

Vijay Devarakonda : విభిన్న కథాంశం తో రాబోతున్న విజయ్ దేవరకొండ..?

Whatsapp Image 2023 10 17 At 11.07.41 Pm

Whatsapp Image 2023 10 17 At 11.07.41 Pm

రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్.అలాగే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‍లో ఇంకో మూవీ కూడా ఆయన చేస్తున్నారు. వీటి తర్వాత ఓ విభిన్నమైన చిత్రం చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరో సారి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నటించనున్నాడు.. గతంలో విజయ్ – రాహుల్ కాంబినేషన్‍లో టాక్సీవాలా తెరకెక్కి మంచి విజయం సాధించింది. వీరి కాంబో మరోసారి రిపీట్ కానుంది.రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేయనున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో ఉండనుందని సమాచారం.. అలాగే, ఇది పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఉండనుందని సమాచారం.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ పనులను రాహుల్ ఇప్పటికే చివరి దశకు తెచ్చినట్టు సమాచారం.విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యన్ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‍లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి మూవీ పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ మూవీని మొదలుపెడతారని సమాచారం.

విజయ్ – రాహుల్ కాంబినేషన్‍లో 2018లో ట్యాక్సీవాలా సినిమా వచ్చింది. సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఇది లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది.. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుంది.. వచ్చే ఏడాది వేసవికి ఈ మూవీ రిలీజ్‍ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇటీవల విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి మూవీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అంతగా ఆడలేదు.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. దీనితో తరువాత సినిమాల పై విజయ్ పూర్తి దృష్టి పెట్టాడు.

Exit mobile version