NTV Telugu Site icon

Toofan Teaser: విజయ్ ఆంటోనీ ‘తుఫాన్’ టీజర్ వచ్చేసింది!

Toofan Teaser

Toofan Teaser

Vijay Antony’s Toofan Teaser: వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరైన హీరో ‘విజయ్ ఆంటోనీ’. బిచ్చగాడు, రోషగాడు, రాఘవన్, సైతాన్, లవ్ గురు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్.. తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో తుఫాన్ సినిమాను దర్శకుడు విజయ్ మిల్టన్ రూపొందిస్తున్నారు. జూన్ మాసంలో ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది.

తుఫాన్ సినిమా టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విజయ్ మిల్టన్, హీరో విజయ్ ఆంటోనీ, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, రచయిత భాష్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం 23 సెకండ్ల నిడివి గల ఈ టీజర్‌.. కొన్ని జీవితాలు తక్కువనే ఆలోచన ప్రపంచంలోని తప్పులన్నింటికీ మూలం అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. తుఫాన్ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ప్రస్తుతం తుఫాన్ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్‌ను అండమాన్, డయ్యూ డమన్‌లలో జరిపారు.

Also Read: Vijay Antony: భవిష్యత్‌లో కూడా చెప్పులు వేసుకోను.. విజయ్‌ ఆంటోని షాకింగ్ కామెంట్స్!

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ సరసన మేఘా ఆకాష్ నటిస్తున్నారు. సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్, ప్రముఖ కన్నడ హీరో డాలి ధనంజయ, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. బాహుబలిలో కట్టప్పగా ఆకట్టుకున్న సత్యరాజ్ విలన్ రోల్ చేస్తునట్లు సమాచారం.

 

Show comments