NTV Telugu Site icon

Simhachalam: సింహాచలం ఆలయ భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ

Simhachalam

Simhachalam

Simhachalam: సింహాచలం దేవస్థానం ఆలయ భూములు అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ జరగనుంది. త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణ జరపనుంది. కమిటీ సభ్యులను కూడా విజిలెన్స్ అధికారులు విచారించనున్నారు. సింహాచలం ఆలయ భూములతో పాటు మానస్ ట్రస్ట్ కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన రామచంద్ర మోహన్ హయాంలో దేవాదాయ శాఖ రిజిస్టర్‌లో మార్పులు చేసినట్టుగా ఆరోపణలువచ్చాయి. ఈనెల 22వ తేదీ లోపు విశాఖ రీజినల్ విజిలెన్స్ కార్యాలయంకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం హయాంలో ముగ్గురు సభ్యులతో విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సభ్యులను కూడా విజిలెన్స్ అధికారులు విచారించనున్నారు.

Read Also: Solar Plant: సోలార్ పవర్ ప్లాంట్ పనులను అడ్డగించిన స్థానికులు

 

Show comments