NTV Telugu Site icon

Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్‌ను రిసీవ్ చేసుకున్నా..

Vidyasagar Rao

Vidyasagar Rao

తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు అయిదుగురు ముఖ్యమంత్రులు నా కోసం వేయిట్  చేశారని.. కానీ మా రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యత అని విద్యాసాగర్‌రావు అన్నారు. తాను రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “సాంస్కృతిక జాతీయ వాదం అందరిలో ఉంది.. పార్టీలు వేరు కావొచ్చు. ఎల్లంపల్లికి శ్రీపాద రావు పేరు పెట్టాలని డిమాండ్ చేసిందే బీజేపీ. వాజపేయిని ప్రధాన మంత్రి అవుతావని నెహ్రూ అన్నారు. సాంస్కృతిక జాతీయ వాదం ఉంది. ఐక్య రాజ్య సమితిలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత అయిన వాజ్ పేయిని పీవీ పంపించారు. పాలక పక్షానికి, ప్రతి పక్షానికి పెద్దగా డిఫరెన్స్ లేదు.. అంబేడ్కర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న భారత జాతిని వదిలిపెట్టలేదు..” అని మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు.

READ MORE: UNIKA Book Release Event: ఒకే వేదికపై ప్రధాన పార్టీల నాయకులు.. మీ ఐఖ్యతకు సలాం!

దేశం అయిదవ ఆర్థిక శక్తి గా ఎదిగినా.. ఇంకా పేదరికం ఉంది. రేవంత్ రెడ్డి తీసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంతో పేదరికాన్ని తగ్గించవచ్చని విద్యాసాగర్‌రావు అన్నారు. “హైడ్రాను అందరూ పొగుడుతున్నారు..హైదరాబాద్ నగరాన్ని సుందరంగా నిర్మించుకోవాలని ముందుకు వెళ్లడం మంచిది. మూసి నదిని ప్రక్షాళన చేయాలి.. కోనేరు రంగారావు రిపోర్ట్‌ను అమలు చేయాలి.. గిరిజనుల భూ హక్కులను కాపాడాలి.. ప్రజలు సీఎం చేసే కార్యక్రమాలకి సహకరిస్తారు. పాలక, ప్రతిపక్షం కొన్ని సందర్భాల్లో అయిన కలిసి పని చేయాలి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేట్ బిల్లు పెడితే అయన మద్దతు ఇచ్చారు.. పాస్ అయ్యేలా చేశారు..” అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు వెల్లడించారు.

READ MORE: Danam Nagender: “కేటీఆర్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు”.. నేను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది..

 

Show comments