Site icon NTV Telugu

Vidudhala Part 2 : వెట్రిమారన్‌కు బర్త్డే విషెస్ తెలియజేసిన చిత్ర యూనిట్..

Whatsapp Image 2023 09 04 At 8.04.38 Pm

Whatsapp Image 2023 09 04 At 8.04.38 Pm

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనుష్ తో తెరకెక్కించిన అసురన్ సినిమా తో సంచలనం సృష్టించాడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను తెలుగు లో వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేసారు.ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధించింది.నేడు వెట్రిమారన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా విడుతలై పార్ట్ 2 చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలియజేసింది.టీం తరపున వెట్రిమారన్‌కు బర్త్డే తెలియజేస్తూ విజయ్ సేతుపతి ట్వీట్ చేసారు.ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లీడింగ్ దర్శకుల్లో టాప్ ప్లేస్‌ లో ఉంటారు దర్శకుడు వెట్రిమారన్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీ గా ఉంటాయి. అసురన్ మూవీ తరువాత వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుతలై పార్ట్‌-1 (తెలుగు లో విడుదల పార్ట్‌ 1) ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం సాధించింది..

ప్రస్తుతం ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌ విడుతలై పార్ట్‌ 2 ను పూర్తి చేసే పనిలో ఎంతో బిజీగా ఉన్నాడు దర్శకుడు వెట్రిమారన్‌. ఈ సినిమాతో కమెడియన్‌ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.విడుతలై పార్ట్‌-1లో విజయ్‌ సేతుపతి పెరుమాళ్‌ వాథియార్ అనే పాత్రలో నటించాడు. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌ గా ఆయన ముఖ్య పాత్రలో నటించారు.. సీక్వెల్‌లో కూడా విజయ్‌ సేతుపతి పాత్ర కొనసాగనున్నారు.ఇందులో ఈ మక్కల్ సెల్వన్‌కు సరసన మంజు వారియర్‌నటించబోతుందని సమాచారం. అడవి బిడ్డలైన గిరిజనులకు మరియు పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దర్శకుడు వెట్రిమారన్ ఎంతో రియలిస్టిక్ గా ఈ సినిమా ను తెరకెక్కించారు. అతి త్వరలోనే పార్ట్ 2 కూడా విడుదల కానుంది .

https://twitter.com/VijaySethuOffl/status/1698557826057343397?s=20

Exit mobile version