Vidya Balan : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నటీనటుల కోసం ప్రత్యేకంగా కారవాన్స్ ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం చిన్న హీరోలకు కూడా కారవాన్స్ ఉంటున్నాయి. వాళ్లకే కాకుండా సినిమాలో నటించే నటీనటులకు కూడా కారవాన్ ఏర్పాటు చేయాల్సిందే. అప్పట్లో కారవాన్లు లేకపోవడంతో హీరోయిన్లు రెడీ అయ్యేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు చెట్ల పక్కకు పోయి కూడా దుస్తులు మార్చుకున్నామని బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఓ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే కారవాన్ లేకపోవడంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఇన్నోవా కారులో బాలీవుడ్ నటి విద్యాబాలన్ దుస్తులు మార్చుకోవాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Read Also:OTT : చేతులు మారిన తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్.. కారణం ఇదే..
డర్టీ పిక్ఛర్ సినిమాతో బాలీవుడ్ లో విద్యాబాలన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ తర్వాత ఆమె నటించిన ‘కహానీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2012లో విడుదలైంది. కోల్‌కతా మెట్రోలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే, ఈ సినిమా మాత్రం 79 కోట్లు రాబట్టింది. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో విద్యాబాలన్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
Read Also:IPL 2025 Auction: భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు చోటు.. ఐపీఎల్ ప్రాంచైజీలకు పెద్ద బొక్క!
కహానీ సినిమాకు బడ్జెట్ కారణంగా కారవాన్ ను పెట్టలేదట. దీంతో, రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులోనే విద్యాబాలన్ బట్టలు మార్చుకోవాల్సి వచ్చిందట. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కహాని సినిమా షూటింగ్ లో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. ఆ షూటింగ్ లో ఎలాంటి కారవాన్ లేదు. పైగా సినిమాకి పెద్ద బడ్జెట్ కూడా లేదు. దీంతో, సెట్స్ లో నేను బట్టలు మార్చుకోవలసి వచ్చినప్పుడల్లా.. ఇన్నోవా కారు కిటికీకి నల్లటి గుడ్డ చుట్టి.. ఆ కారులో బట్టలు మార్చుకున్నాను’ అంటూ ఆమె తెలిపింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. ‘‘కారవాన్, ఇతర సౌకర్యాలు కల్పించలేదు. అందుకు విద్యా బాలన్ మా సినిమా నుంచి తప్పుకోవచ్చు. కానీ ఆమె ముందు ఇచ్చిన మాట కోసం కహానీ సినిమాలో నటించింది. ఆ కాలంలోని నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి వారందరూ తమ మాటకు కట్టుబడి ఉన్నారు. అలాంటి వారిలో విద్యా బాలన్ కూడా ఒకరు అని చిత్ర దర్శకుడు సుజోయ్ ఘోష్ తెలిపారు.