Site icon NTV Telugu

Video Viral: ఒకే ఇంటి పైకి చేరిన చిరుత, ఎలుగుబంటి.. చివరికి..?!

9

9

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కారణం చేత ఏ దేశంలో ఏ విషయం జరిగిన ప్రపంచం మొత్తం ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే..

Also Read: Yuvraj Singh: అభిషేక్ శర్మపై యూవీ ఫైర్.. ఎందుకో తెలుసా..?

అటవీ సమీప ప్రాంతాల్లో ఉన్న సమీప గ్రామాల్లోకి ఏనుగులు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అనేక అనూహ్య ఘటనలు మనం చూసే ఉంటాము. తాజాగా వైరల్ గా మరీనా వీడియోలో ఏప్రిల్ 5న తమిళనాడులోని ఊటీ పరిధి యెల్లనల్లి కైకట్టి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి మేడపై ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాలో కాస్త షాకింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

Also Read: Samyuktha Menon: ఆరేంజ్ కలర్ డ్రెస్సులో అదరగొడుతున్న సంయుక్త..

ఆ ప్రాంత అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత.. యెల్లనల్లి కైకట్టి గ్రామానికి చేరుకొని.. నేరుగా ఓ ఇంటి మేడ పైకి వచ్చింది. అయితే దానికి అక్కడ ఎలాంటి ఆహారం దొరకకపోవడంతో అటూ ఇటూ చూసి., చివరకు గోడ దూకి కిందకు వెళ్ళింది. అయితే చిరుత వెళ్లిన కాసేపటికే ఓ పెద్ద ఎలుగుబంటి కూడా అక్కడికి చేరుకుంది. అది కూడా చిరుతపులి తరహాలో అటూ ఇటూ చూసి ఎలాంటి ఆహారం దొరకకపోవడంతో చివరకు చిరుత వెళ్లిన మార్గంలో వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది.

Exit mobile version