బీచ్ అనగానే సరదాగా గడపడం.. ఇసుకలో ఆడుకోవడం.. కేరింతలు కొట్టడం.. ఇలా ఒక్కటేంటి. ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే కొందరు బీచ్‌లో పిల్లలతో పాటు పెద్దవాళ్లు హాయ్‌గా గడుపుతున్నారు. ఇంతలో ఊహించని విపత్తు చోటుచేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అసలు ఇంతకీ ఏమైంది? బీచ్‌కి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Sudheer Babu Wife: ఇప్పుడిలా ఉన్న మహేష్ బాబు చెల్లి.. అప్పుడు ఇలా ఉండేదా..?
బీచ్‌లో పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా పిల్లలపై పిడుగుపడింది. దీంతో వారు షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న పెద్దవాళ్లు అప్రమత్తమై వారికి సపర్యాలు చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని ఆస్పత్రికి తరలించారు. మే 27న ప్యూర్టో రికో బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తర తీరప్రాంత పట్టణమైన ఇసాబెల్‌లోని ప్యూర్టో రికన్ బీచ్‌లో 7 నుంచి 12 సంవత్సరాల వయసుకు చెందిన యూఎస్ పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు అగుడిల్లా పట్టణంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: kidney Operation: ఎడమ కిడ్నీ బదులు, కుడి కిడ్నీ తొలగింపు.. మహిళ పరిస్థితి విషమం..
పిడుగు పడగానే పిల్లలందరూ ఒకేసారి వెనుకకు పడిపోయే ముందు అకస్మాత్తుగా వెలుగు వచ్చినట్లుగా కనబడింది. కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కలవారు వారి సహాయానికి చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పిల్లలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
NEW: Three American children struck by a lightning bolt on a beach in San Juan, Puerto Rico.
The children, ages 7, 10 and 12 were huddling with each other when a lightning bolt hit the group.
The kids were seen all falling backward at the same time when the bolt hit them.… pic.twitter.com/McCCoyDxgI
— Collin Rugg (@CollinRugg) May 28, 2024