Site icon NTV Telugu

Vijay Deverakonda : క్రికెటర్ తిలక్ వర్మకు హీరో విజయ్ దేవరకొండ సవాల్.. అదేంటంటే?

Vijay Thilak

Vijay Thilak

తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా ఆరు విజయాల నుండి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో ముంబై వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇది మూడోసారి. ఈ సీజన్‌లో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ టీంకు చేయూతనందిస్తున్నాడు.

READ MORE: MG Windsor Pro: లెవల్ 2 ADAS, 38kWh బ్యాటరీ, 332 కీ.మీ. రేంజ్‌తో విండ్సర్ ప్రో లాంచ్..!

కాగా.. నేడు వాంఖ‌డే వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కి ముందు ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు తిలక్ వర్మ, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పికిల్ బాల్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్ దేవరకొండ సరదాగా తిలక్‌కి ఒక ఛాలెంజ్ చేశాడు. బెస్ట్ ఆఫ్ త్రీలో తనను ఓడిస్తే ముంబై ఇండియన్స్ జెర్సీని ధరిస్తానని సవాల్ విసిరాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో తిలక్ టీం పరాజయం పాలైంది. ఈ పికిల్ బాల్ మ్యాచ్‌లో విజయ్ దేవరకొండ టీమ్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సినీ, క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

READ MORE: Barrelakka: “నాకు పెళ్లైన సంతోషం కూడా లేదు” బర్రెలక్క వీడియో వైరల్..

Exit mobile version