NTV Telugu Site icon

Viral News: మతిపోయిందా వీళ్లకు.. బురదలో క్రికెట్ మ్యాచ్ ఏంట్రా బాబు..!

Cricket

Cricket

ఇండియాలో క్రికెట్ అంటే ఇష్టపడని వారుండరు. ఒక్క మ్యాచ్ ను విడిచిపెట్టకుండా చూసే అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. క్రికెట్ ఆడే యువత కూడా చాలా మందే ఉన్నారు. సెలవులు వచ్చాయంటే చాలు బాల్, బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో వాలిపోతారు. అంతేకాకుండా.. పార్కుల్లో, గల్లీల్లో కూడా క్రికెట్ ఆడే మంది చాలా మంది ఉంటారు. అయితే క్రికెట్ ఆడుతున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.

Read Also: Bhimaa: ‘భీమా’ బ్రహ్మరాక్షసుడు.. అంతా శివుని ఆజ్ఞ : హీరో గోపీచంద్ ఇంటర్వ్యూ

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. కొంతమంది యువత బురదలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. బురదలో క్రికెట్ పిచ్‌ను తయారు చేసుకుని వీరు ఆడుతున్నారు. క్రికెట్ ఆడే వ్యక్తులు తమ శరీరమంతా మట్టిని పూసుకున్నారు. ఆ తర్వాత ఒకరు బౌలింగ్ చేస్తుంటే.. మరొకరు బ్యాటింగ్ చేస్తున్నాడు. మొత్తం నలుగురు ఉన్నారు. అందులో ఒకరు బౌలింగ్ చేస్తుండగా, రెండో వ్యక్తి బ్యాటింగ్, మూడో వ్యక్తి కీపింగ్, నాలుగో వ్యక్తి అంపైర్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Read Also: Kishan Reddy: మోడీని పెద్దన్న అని రేవంత్ ఎందుకన్నారో ఆయన్నే అడగండి..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో krishu_maurya_9612 అనే ఖాతాతో పోస్ట్ చేశారు. కాగా.. ఈ వీడియోను 3.6 మిలియన్ల మంది వీక్షించారు. అంతేకాకుండా.. లక్షకు పైగా లైక్‌లు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Show comments