Vidadala Rajini: కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయడం మానేసింది.. సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణపైనే దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హాస్టల్స్ లో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని మండిపడ్డారు.. ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులను పరామర్శించారు. కురుపాం, అనపర్రు ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారని నిప్పులు చెరిగారు. 31 మంది విద్యార్థులు ఇంకా జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని, విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏంటో ప్రభుత్వం ఇంతవరకూ నిర్ధారించకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.. విద్యార్దుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వార్డెన్ మీద విద్యార్థులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులను వార్డెన్ కొడుతున్నా పట్టించుకున్నవాళ్లే లేరన్న ఆమె.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అంతేకాదు.. సంక్షేమ హాస్టల్స్ ను విజిట్ చేస్తే ఈ ప్రభుత్వం కేసులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి విడదల రజిని..
Vidadala Rajini: వైద్య ఆరోగ్య శాఖ పనిచేయడం మానేసింది.. ప్రైవేటీకరణపైనే దృష్టి పెట్టారు..!
- కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయడం మానేసింది..
- సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణపైనే దృష్టి పెట్టారు..

Vidadala Rajini