నేటి నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ తలపడ్డాయి. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు దశాబ్దం తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో గెలుచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో స్కాట్‌లాండ్‌ను ఓడించింది. దీంతో.. పదేళ్ల తర్వాత టీమ్ విజయం సాధించడంతో జట్టులోని ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి.. టీ20 వరల్డ్‌కప్‌ను 10 ఏళ్ల తర్వాత గెలుచుకోవడం, రెండో కారణం ఈ టీ20 వరల్డ్‌కప్‌ను బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ నిర్వహించలేకపోయారు.
Read Also: DY Chandrachud: ‘లాయర్లకు అవగాహన ఉందా లేదా?’ కోర్టులో సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహం..
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌లో శోభనా మోస్త్రి 36, షాతి రాణి 29, కెప్టెన్ సుల్తానా 18 పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ తరఫున సస్కియా హోర్లీ మూడు వికెట్లు తీసింది. 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు 20 ఓవర్లు ఆడి ఏడు వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ సారా బ్రీస్ 49 పరుగులు చేసినప్పటికీ, ఇతర బ్యాట్స్‌మెన్లు రాణించలేకపోయారు. బంగ్లాదేశ్‌లో రీతూ మోని రెండు వికెట్లు పడగొట్టింది.
Read Also: Marital Rape: వైవాహిక అత్యాచారాలపై కేంద్రం కీలక నిర్ణయం..
2023, 2020, 2018, 2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. జట్టు చివరి విజయం 2014 టీ20 ప్రపంచకప్‌లో ఉంది. బంగ్లాదేశ్.. శ్రీలంక, ఐర్లాండ్‌లను ఓడించినప్పుడు ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ.. బంగ్లాదేశ్ జట్టుకు విజయం నమోదు కాలేదు.