కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్న ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఒక వైపు ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోంది. అయినా విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంకో వైపు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. విపక్ష పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. కాగా.. నేడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ అంశంపై చర్చించనున్నారు.
READ MORE: Cyclone Asna : 48 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో అస్నా తుపాను.. టెన్షన్లో వాతావరణ శాఖ
ఈ ఘటనపై బాధితురాలి తల్లి స్పందించారు. నిరసనలకు వ్యతిరేకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదన్నారు. తన కుమార్తెపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా డాక్టర్లు, విద్యార్థులు, తదితరులు న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు. నిందితులకు శిక్ష పడేవరకు విద్యార్థులు ఊరుకోరన్నారు. ఈ అంశంపై ప్రపంచం మొత్తం తన కుమార్తెకు అండగా నిలుస్తుందన్నారు. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మమత వ్యాఖ్యలు మరింతగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పిల్లలు ఉంటే ఆ బాధ ఏంటో తెలిసేదన్నారు.
READ MORE:Harish Rao: ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు.. హరీష్ రావ్ ట్వీట్ వైరల్..
కాగా.. గురువారం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్లను హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే మీ జీవితాలు నాశనమవుతాయి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిరసనలు ఆగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే మీ భవిష్యత్తు నాశనమవుతుందని.. మీరు ఎప్పటికీ విసా, పాస్‌పోర్టులు పొందలేరని మమతా వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన బాధితురాలి తల్లి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
