సరదాకోసమని వెర్టిగో రైడ్ ఎక్కితే ప్రాణం పోగొట్టుకునేంత పనైంది. 100 అడుగుల ఎత్తులో వెర్టిగో రైడ్ ఆగిపోవడంతో డజన్ల కొద్ది ప్రయాణికులు గాల్లో బిక్కు బిక్కుమంటూ గడిపారు. నార్త్ కరోలినా స్టేట్ ఫెయిర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక రైడ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. పీపుల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, లో-వోల్టేజ్ సమస్య కారణంగా వెర్టిగో రైడ్ పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు గాలిలో చిక్కుకుపోయారని వెల్లడించింది.
Also Read:IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన ఆసీస్
అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణీకులను సురక్షితంగా కిందికి దించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీడియోలో రైడ్ శిఖరం వద్ద చిక్కుకుపోయిన ప్రయాణికులు, ఫెయిర్ గ్రౌండ్స్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. రైడర్ హన్నా నోరిస్ తన భయానక అనుభవాన్ని పంచుకుంది. తాను పడిపోతానని అనుకున్నానని తన కొడుకు భద్రత కోసం ప్రార్థించానని ఆమె తెలిపింది. వెర్టిగో ఆపరేటింగ్ కంపెనీ కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.
Eventful afternoon at the NC State Fair as a ride stopped due to a low voltage issue, stranding riders 100 feet in the air. Everyone was able to get off after around 45 minutes with no injuries. (Video from Allicia Best) #ride #statefair #nc #fairide #stuck pic.twitter.com/vZTDk9uGZA
— Matthew Huddleston (@MatthewHWx) October 18, 2025