NTV Telugu Site icon

Snake Video: విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో విషపూరిత పాము.. వీడియో వైరల్

Snake

Snake

Snake Video: సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ పాములు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా స్కూల్‌ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి స్కూల్‌ బ్యాగ్‌లో నుంచి పాము బయటపడింది. స్కూల్ బ్యాగ్ నుంచి పెద్ద పాము బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది.

Read Also: Puja khedkar: అమ్మ దొంగా..! చదువు దగ్గర నుంచి అన్ని నకిలీ సర్టిఫికెట్లే..! ట్రైనీ ఐఏఎస్‌ కేసులో కొత్త ట్విస్ట్!

ఓ విద్యార్థి తన నోట్‌బుక్‌ల కోసం బ్యాగ్‌ తీస్తుండగా.. అతనికి పాము కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు బ్యాగ్‌ను బయటకు తీసుకెళ్లి ఒక కర్రను ఉపయోగించి.. బ్యాగ్‌లోని వస్తువులను జాగ్రత్తగా బయట పడేయగా.. బుసలు కొడుతూ నల్లతాచు బయటకు వచ్చింది. ఒక్కసారిగా పాము కనిపించడంతో అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను ఒక కుటుంబ సభ్యుడు వారి ఫోన్‌లో రికార్డ్ చేశారు. బ్యాగ్‌ నుంచి బయటపడిన పాము అక్కడి నుంచి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వర్షాకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇలా వాహనాల్లో, బూట్లలో పాములు బయటకు వచ్చిన సంఘటనలు చాలాసార్లు చూశాం. చీకట్లో పాములు ఎక్కడ దాక్కుంటాయో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా, వస్తువులను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేయాలి. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే విద్యార్థి ప్రాణాలకే ముప్పు ఏర్పడేది.