NTV Telugu Site icon

Venkatesh : స్వామి వివేకానంద వెబ్ సిరీస్ లో నటించాలనుకున్న వెంకటేష్.. కానీ కుదరలేదుగా..

Whatsapp Image 2023 07 05 At 7.55.48 Am

Whatsapp Image 2023 07 05 At 7.55.48 Am

విక్టరీ వెంకటేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుత నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు వెంకటేష్. అలాగే మల్టీ స్టారర్ సినిమాలతో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఈ మధ్యనే రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్‌. ఈ వెబ్‌సిరీస్‌లో నాగనాయుడు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ బోల్డ్ సిరీస్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.. రానా నాయుడు కంటే ముందుగానే వెంకటేష్ స్వామి వివేకానంద పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయాల్సి ఉందని సమాచారం..ఈ సిరీస్‌కు నీలకంఠ దర్శకత్వం వహించాల్సి ఉంది అని తెలుస్తుంది.. కానీ అనివార్య కారణాల ప్రీ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత ఈ సిరీస్ ఆగిపోయినట్లు దర్శకుడు నీలకంఠ పేర్కొన్నాడు. ఇటీవల సర్కిల్ అనే సినిమాను నీలకంఠ తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన స్వామి వివేకనంద సిరీస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ను చేశాడు. స్వామి వివేకానంద సిరీస్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్అంతా పూర్తయినట్లు ఆయన పేర్కొన్నాడు.

స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తెరకెక్కించాలని అనుకున్న ఈ సిరీస్‌లో నటించడానికి వెంకటేష్ ఎంతో ఆసక్తిని కనబరిచారని నీలకంఠ అన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత అనుకోకుండా ఈ సిరీస్ ఆగిపోయినట్లు  ఆయన తెలిపాడు..ఇప్పటికి ఈ సిరీస్ చేయడానికి వెంకటేష్ ఎంతో ఆసక్తి గా ఉన్నారని నీలకంఠ పేర్కొన్నాడు. సరైన ప్రొడ్యూసర్ కనుక దొరికితే స్వామి వివేకానంద సిరీస్ మొదలయ్యే అవకాశం కూడా ఉందని తెలిపాడు దర్శకుడు నీలకంఠ. ప్రస్తుతం ఈ దర్శకుడి కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి..నీలకంఠ దర్శకత్వం వహించిన సర్కిల్ మూవీ ఈ వారం విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో సాయిరోనక్‌, బాబా భాస్కర్‌ మరియు అర్షిణ్ మోహతా ప్రధాన పాత్రలలో నటించారు.