NTV Telugu Site icon

Venkatesh Prasad: టాప్-5 భారతీయ క్రికెటర్లలలో కోహ్లీ, రోహిత్, ధోనిలకు దక్కని చోటు

Venkatesh Prasad

Venkatesh Prasad

Venkatesh Prasad: టీమిండియా మాజీ సెలెక్టర్, కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జాబితాలో అతను ఆధునిక క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, ధోనీ (MS Dhoni), జస్ప్రీత్ బుమ్రా (Bumrah) వంటి ఆటగాళ్లను చేర్చలేకపోయాడు. ఈ జాబితాను ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. వెంకటేష్ ప్రసాద్ తన జాబితాలో తొలి నాలుగు స్థానాలను సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేలకు ఇచ్చారు. వీరు భారత క్రికెట్ చరిత్రలో టాప్ ఆటగాళ్లని ఆయన పేర్కొన్నారు. అయితే ఐదవ స్థానంలో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గుండప్ప విశ్వనాథ్ ల పేర్లను వెంకటేష్ ప్రసాద్ సంయుక్తంగా ఉంచారు.

Also Read: Madanapalle Market: టమాటా రైతు కంట నీరు.. పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి..!

వీటితోపాటు ప్రసాద్ అనేక ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. ఒక అభిమాని అతనిని ఆధునిక కాలంలో గొప్ప ఆటగాళ్ల గురించి అడిగితే అందుకు విరాట్ కోహ్లీ, బుమ్రా పేర్లను చెప్పాడు. మరొక అభిమాని అతని ఫేవరెట్ ప్లేయర్ల గురించి అడిగితే, ప్రసాద్ తన అభిమాన ఆటగాళ్లను వివిధ ఫార్మాట్లలో పేర్కొన్నారు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్‌ను, వన్డేలో విరాట్ కోహ్లీని, టీ20లో హెన్రిచ్ క్లాసెన్‌ను తన ఫేవరెట్ ఆటగాళ్లుగా ఎంపిక చేసారు.

Also Read: Coldplay Concert: కోల్డ్ ప్లే క‌న్స‌ర్ట్‌లో జ‌స్ప్రీత్ బుమ్రా సంద‌డి మాములుగా లేదుగా.. వీడియో వైరల్

వెంకటేష్ ప్రసాద్ భారత జట్టుకు ఆడిన తర్వాత కూడా సెలెక్టర్, కోచ్‌గా కూడా పనిచేశారు. ఆయన భారతదేశం తరపున 33 టెస్టులు, 161 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 123 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రసాద్, భారత క్రికెట్ చరిత్రలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రసాద్ తన టాప్-5 క్రికెటర్ల జాబితాలో ఆధునిక దిగ్గజాలకు చోటు ఇవ్వకపోవడం, క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అతని అభిప్రాయంలో ప్రస్తుత కాలంలో కొంతమంది ఆటగాళ్లు నిపుణులుగా నిలిచినా, గత కాలంలో ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరమని ఆయన భావిస్తున్నారు.