వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన రిలీజ్ అవుతుంది.. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భిన్నంగా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించింది సినిమా టీం. ఇక ఈ సందర్భంగా వెంకటేష్ గతంలో నటించిన సినిమాల పాటలను కూడా పాడి వినిపించారు సింగర్లు.
READ MORE: Delhi Assembly Elections: బీజేపీ రెండో జాబితా విడుదల.. ఎవరెవరికి చోటు దక్కిందంటే?
ఈ నేపథ్యంలో వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెంకటేశు అంటూ సాగే ఒక సాంగ్ పాడింది సింగర్ మధుప్రియ. తర్వాత వెంకటేష్ వచ్చి కూర్చున్నారు. ఇక మధుప్రియ పాట పాడుతూ కిందకు వచ్చి వెంకటేష్ ని తనతో డాన్స్ చేయమని కోరింది. సాధారణంగా స్టార్ హీరోలు ఎవరైనా అయితే సైలెంట్ గా ఉండిపోతారు గాని వెంకటేష్ మాత్రం చాలా యాక్టివ్గా సాంగ్ కి డాన్స్ చేయడమే కాదు తన అభిమానులందరినీ అలరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
READ MORE: Megha Shukla : అమ్మడు ఈ రేంజ్ లో చూపిస్తే అబ్బాయిలు ఆగుతారా చెప్పు