NTV Telugu Site icon

Venkatesh : వారసుడి సినీ ఎంట్రీపై విక్టరీ వెంకటేష్ కామెంట్స్.. ఏమన్నారంటే?

New Project 2024 12 27t070001.343

New Project 2024 12 27t070001.343

Venkatesh : సినీ పరిశ్రమలో వారసులకు కొరత లేదు. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోల వారసులందరూ ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొందరు స్టార్ హీరోలుగా వెలిగిపోతుండగా.. మరికొందరు ఘన విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, టాలీవుడ్‌కు నాలుగు స్తంభాలుగా ఓ వెలుగు వెలిగిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురు ఇండస్ట్రీని నిలబెట్టారు. తెలుగు చిత్రాలకు కిరీటాలుగా నిలిచారు. అయితే, ఈ నలుగురు స్టార్ హీరోల వారసులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. కానీ నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా మారారు.

Read Also:Kiccha Sudeep’s Max Review: కిచ్చా సుదీప్ ‘మాక్స్’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

నాగార్జున కుటుంబం నుండి నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా కొనసాగుతున్నారు.. కానీ స్టార్‌డమ్ రాలేదు. ఇప్పుడు వెంకటేష్ మాత్రమే మిగిలి ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ కుమారుడు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నాడు. వెంకీకి ముగ్గురు కూతుళ్లు ఉండగా, అర్జున్ చివరిగా జన్మించాడు. ఫలితంగా, అతను చిన్నవాడు కాబట్టి అతను ఇండస్ట్రీకి ఆలస్యంగా వచ్చాడు. వెంకటేష్ కొడుకు వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు, ఉన్నత చదువులు చదువుతున్నాడు. విదేశీ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే దానిపై వెంకటేష్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 3 సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్‌కు వెంకటేష్ వచ్చాడు. ఈ సందర్భంగా వారసుల అంశం వారి మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటేష్ కుమారుడు అర్జున్ గురించి ప్రస్తావించారు.

Read Also:Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత

హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే దానిపై వెంకటేష్ ఎలాంటి క్లారిటీ ఇచ్చారో చూడాలి. ఈలోగా వెంకటేష్ తనకు నచ్చే కథలను ఎంచుకుని సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత రమణ గోకుల కూడా ఈ సినిమాలో ఒక పాట పాడారు. ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది.