Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
- నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో విషాదం
- అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- ఇద్దరు బిడ్డలతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య
తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భార్య, తల్లిని హత్య చేసి ఇద్దరు బిడ్డలతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య హరిత (35), తల్లి చంద్రకళ (60), ఇద్దరు చిన్నారులు (శశాంక్, హిమనీ), తండ్రి మోహన్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పుత్తూరు ఆస్పత్రికి తరలించారు. మార్చురీకి చేరుకున్న మోహన్ బంధువులు.. మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు.
ఐదుగురి మృతిపై పుత్తూరు డీఎస్పీ రవి కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘భార్య హరితను, తల్లి చంద్రకళను మోహన్ చంపేశాడు. సైకలాజికల్ డిజార్డర్‌తో మోహన్ బాధపడుతున్నట్లు మాకు అనుమానంగా ఉంది. హరితను, చంద్రకళను చంపడానికి మోటివ్ ఏంటనేది విచారణ జరుపుతున్నాం. బ్యూటీ పార్లర్లో ఉన్న హరితను 10 గంటల సమయంలో మోహన్ ఇంటికి తీసుకెళ్లాడు. హరితను ఒక గదిలో, తల్లి చంద్రకళను మరో గదిలో ఉంచి చీరతో గొంతు నులిమి చంపేశాడు. మేనమామ ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాలను మార్చురీకి తరలించాం. ఇద్దరిని చంపిన తర్వాత మోహన్ స్కూల్ వెళ్ళి పిల్లలని తీసుకెళ్లాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పిల్లల్ని రైలు పట్టాల దగ్గరికి తీసుకెళ్లాడు. మోహన్ రైలు పట్టాలు మీద పడుకున్నప్పుడు ఇద్దరు బిడ్డలు అతన్ని లాగి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ లోపే ముగ్గురు రైలు డీకొని చనిపోయారు. ఈ కేసులో లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరు ప్రాణాలతో లేరు. మోహన్ కి ఆర్ధిక పరమైన సమస్యలు ఏమీ లేవని దర్యాప్తులో తేలింది. భార్య భర్తల మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి’ అని డీఎస్పీ చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
-
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
-
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
-
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
-
Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?