Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూస్తే అది మూర్ఖత్వం అవుతోందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సికింద్రాబాద్ ఫరెడ్ గ్రౌండ్స్‌లో యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యోగా చేస్తే సమగ్ర మనిషిగా మారుతారని.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్నారు. యోగా సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వతోముఖాభివృద్ధికి యోగా అవసరమని పేర్కొన్నారు. మానవ చైతన్యానికి నిదర్శనం యోగా అని.. పూర్వీకులు రంగరించి మనకు అందించిన జీవన విధానమన్నారు. ఆరోగ్య, ఆధ్యాత్మిక, మానసిక ఒత్తిడి, స్థైర్యాన్ని ఇచ్చేది యోగా అని చెప్పారు. యోగా అనేది మనిషికి, ప్రకృతిమాత అందించే గొప్ప వరమని.. ప్రకృతి ఒడిలో ప్రజలు జీవించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము మాటను నిజం చేయాలన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ ప్రసంగించారు. “ప్రపంచానికి యోగాను అందించింది భారతదేశం. ప్రాచీన సంస్కృతిలో భాగమే యోగా. గత ఆధ్యాత్మిక, ఆరోగ్య చింతన ప్రతి ఒక్కరికీ అవసరం.” అన్నారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్రమోడీ 12 సంవత్సరాల క్రితం యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు. ప్రపంచ దేశాల్లో యోగాను చేస్తున్నారని.. వ్యక్తి నిర్మాణంలో యోగా పని చేస్తోందన్నారు. యోగా వల్ల ఆరోగ్య, స్వాస్త్ భారత్ సాధ్యం అవుతుందని చెప్పారు. యోగా వలన డిప్రెషన్ తొలగిపోతుందని.. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ యోగా చేయాలని సూచించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..