NTV Telugu Site icon

Venkaiah Naidu : పదవికి విరమణ ఇచ్చాను కానీ మాట్లాడే పెదవులకు విరమణ లేదు

Venkaiah Naidu

Venkaiah Naidu

గుంటూరు ఆర్‌వీఅర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల ఎనిమిదవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువతను మేల్కోల్పడం నాకు ఇష్టమైన పని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలతో గడపడం నాకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. పదవికి విరమణ ఇచ్చాను కానీ మాట్లాడే పెదవులకు విరమణ లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. విద్యావిధానాన్ని భారతీయకరణ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో యువ శక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదని ఆయన అన్నారు.

Also Read : Byju’s Layoff: 1000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్న బైజూస్

పురుషులతో పాటు స్త్రీ లు పోటీ ప్రపంచంలో దూసుకు వెళ్తున్నారని ఆయన కొనియాడారు. ప్రపంచంలో వస్తున్న మార్పులతో ఉపాధి అవకాశాల తో పాటు పోటీ తత్వం, సవాళ్లు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు. యువత క్రమశిక్షణ, కష్టపడే తత్వం, కలుపుగోలుగా ఉండటం అలవరుచుకోవాలని ఆయన అన్నారు. పాశ్చాత్య ధోరణి మన దేశానికి, యువతకు మంచిది కాదని, భారతీయ ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని ఆయన అన్నారు. యోగను యువత జీవితంలో భాగం కావాలన్నారు. యోగా మతానికి సంబంధించిన అంశం కాదు…ప్రపంచం ఆచరిస్తున్న ఆరోగ్య మంత్రం అని ఆయన అన్నారు.

Also Read : Petrol Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలుసా?