Venkaiah Naidu: ‘యోగా ఫర్ మోడీ కాదు.. యోగా ఫర్ బాడీ’.. మాజీ ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అనాలోచిత యుద్ధమని.. ట్రంప్ ఏమీ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశం శాంతి యుతంగా ఉండాలని, ఇరాన్, ఇజ్రాయెల్ లతో భారతదేశం స్నేహంగా ఉందని తెలిపారు. తాజాగా నక్లేస్ రోడ్లో ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇరాన్ వాళ్ళు థ్యాంక్ యూ ఇండియా అని అంటున్నారని గర్తు చేశారు. ప్రపంచ మంతా శాంతిగా ఉండాలని కోరారు. మనం శాంతి కాముకులం.. కానీ మన జోలికి ఎవరైనా వస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి వాటితో మన ప్రతాపం ఏంటో చూపించామని తెలిపారు. ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో రన్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. దేశ యువత, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
READ MORE: Hyderabad: నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ ప్రొడక్ట్స్.. రసాయనాలతో చిక్కీలు, నమ్కీన్ తయారీ
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
“దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా దేశ యువత ఫిట్ ఉండాలి. యోగా ఫర్ మోడీ కాదు. యోగా ఫర్ బాడీ. ఆరోగ్య మార్పు మాత్రమే శక్తివంతమైన మార్పు. ఉదయం లేవగానే రోజు ఆసనాలు, శరీర వ్యాయామం చేయాలి.
ఎవరికి ఇష్టం ఉన్నా దాంట్లో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉండాలి. సాహిత్యామైన, రన్నింగ్ అయినా, యోగా అయిన ప్రతి చేయాలి. అమెరికాలో సైతం భరత నాట్యం , కూచుపూడీ నేర్పిస్తున్నారు. మన దేశ కల్చర్ ఇతర దేశాల్లో పాటిస్తున్నారు. పోషకాలు ఉండే బియ్యాన్ని తినండి. రాగులు, సజ్జలు జొన్నలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రగ్స్ మారిన పడొద్దు. యువత డ్రగ్, గంజాయి బారిన పడి అనారోగ్యంతో పాటు వ్యసనంగా మారి పనికి రాకుండా పోతున్నారు. సృజనాత్మకత పెంపొందించుకోవాలి. మొబైల్ వాడండి కానీ వ్యసనంగా వాడొద్దు. పురుషులతో సమానంగా మహిళలను భావించండి. కుటుంబ సభ్యులతో సమయం కేటాయించి గడపండి. ఇంట్లో వృద్ధులతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవాలి. భారత్ దేశ కుటుంబ వ్యవస్థ గొప్పది. పెద్దల మాట సద్ది మూట. పాఠాలు చెప్పిన గురువులను మర్చిపోవద్దు. తల్లిదండ్రులను, మాతృభాష, మాతృభూమి, దేశాన్ని గౌరవించండి. ఇంగ్లీష్ భాష కళ్ళద్ధలాంటిది. అమ్మ భాషలో మాట్లాడండి. బ్రో ఏంటీ బ్రోకర్ హా ? అని అడిగా. మంచి భోజనం చేయండి. పీజా, బర్గర్లు తినొద్దు.” అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!