RCB Fastest Chase IPL: కోహ్లీ క్లాస్.. పడిక్కల్ మాస్.. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ బిగ్గెస్ట్ రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Fastest Chase IPL: ఐపీఎల్ షూరు అయ్యింది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రికార్డు బద్దలు గొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఆర్సీబీ చేరుకుంది. ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 200 పైచిలుకు లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా ఆర్సీబీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో రాజస్థాన్ రాయల్స్ (15.5 ఓవర్లలో 210 పరుగులు) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సేన చెరిపేసింది. ఈ లక్ష్య ఛేదనలో ఫిలిప్ సాల్ట్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (61) జంట విధ్వంసం సృష్టించింది. ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అంతేకాదు.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. చివర్లో కెప్టెన్ రజత్ పాటిదార్ (31) పైతం రాణించాడు.
READ MORE: Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ వర్మ త్వరగానే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే.. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ జతకలవడంతో ఇన్నింగ్స్ ఊపందుకుంది. నాలుగో వికెట్‌కు ఇషాన్ కిషన్ మరియు క్లాసెన్ (31) జోడి కేవలం 53 బంతుల్లోనే 97 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు దిశగా సాగింది. వరుస సిక్సర్లతో హోరెత్తించిన క్లాసెన్ 14వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఎట్టకేలకు 201 పరుగులు చేసినా.. ఓటమి పాలైంది.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!