Venkaiah Naidu About her political journey
అయితే ప్రెసిడెంట్, లేదా డిసిడెంట్.. అదీకాక పోతే.. రెసిడెంట్ అనే థాట్ నాకు లేదంటున్నారు వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి హోదాలో చివరిసారిగా విలేఖరులతో విందు భోజనం చేశారు వెంకయ్య నాయుడు. అనంతరం విలేకరులతో ముచ్చటిస్తూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
1965లో ఏబీవీపీ నాయకుడి మొదలైన తన రాజకీయ ప్రస్థానం నుంచి ఉప రాష్ట్రపతి బాధత్యలు స్వీకరించి.. ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని ఆయన పంచుకున్నారు. పహిల్వాన్ కాంతారావుతో జరిగిన గొడవ తరువాత.. జై ఆంధ్ర ఉద్యమం, జేపీ ఉద్యమం, ఎమర్జెన్సీ జైలు జీవితం రాజకీయాల్లో రాటుదేల్చాయన్న ఆయన.. ఆత్మకూరు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయిన సంఘటనను స్మరించుకున్నారు. అప్పటికే రెండు సార్లు నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచిన వెంకయ్య నాయుడు.. ఆ తరువాత ఆత్మకూరు నుంచి బరిలోకి దిగారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తనకు ఎంతో మేలు చేసిందని.. ఒక వేళ ఆత్మకూరులో గెలిచి ఉంటే.. రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై ఉండేవాణ్నేమోనని అభిప్రాయపడ్డారు.
అయితే.. ఎమర్జెన్సీ సమయంలో విశాఖపట్నం జైలులో ఉండగా.. ఆనాడు కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య విశాఖకు సంజయ్‌గాంధీని తీసుకువచ్చి బహిరంగ సభ నిర్వహిస్తే.. జైలులో ఉన్న తాను అనారోగ్యం సాకుతో ఆసుపత్రికి వెళ్లి ఆ బహిరంగ సభను భగ్నం చేసిన విషయాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా.. దేవుడి దయ, పెద్దల అభిమానంతో అన్నీ పదవులు దక్కాయని.. ఈ ప్రోటొకాల్ ఆంఓల తన వ్యక్తిత్వానికి సరిపడవన్నారు. అయితే.. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లా ప్రముఖ కళాశాలల్లో చదువుకోకపోయినా.. నిరంతరం ప్రజలతో మమేకం అవడమే జ్ఞానం నేర్పిందన్నారు.
అయితే.. మోడీతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని.. ఆయనకు చేసిన కొన్ని సూచనలపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మోడీ పనితీరుపై తన భార్య రెండు సూచనలు చేసిందన్నారు. మొదటిది మోడీని అప్పుడప్పుడు నవ్వుతూ ఉండమనడం కాగా.. రెండోది రోజూ అవసరమైనంత నిద్ర. ఇదే విషయాన్ని మోడీకి చెప్పగా.. నవ్వడం అలవర్చుకున్నారని.. కానీ నిద్ర రావడం కష్టమేఅని సమాధానం ఇచ్చారట.
అయితే.. ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆయనకు రాష్ట్రపతి అయ్యే ఆలోచన లేదన్నారు. కానీ.. క్రియాశీలకంగా ఉండటం మాత్రం మానబోనన్నారు. పరిస్థితులపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం మానుకోనని, తన ముందుకు వచ్చే అంశాన్ని ప్రధాని ముందు పెడుతానన్నారు. అయితే ఇదే సమయంలో.. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ పుస్తకం రాస్తే వాస్తవాలు రాయాలి.. బతికున్న వారి గురించి రాస్తే యథార్థాలు రాయాలి.. అలా రాస్తే అనర్థాలు వస్తాయి’ అంటూ చమత్కరించారు.
అయితే.. ఫైనల్‌గా ఏ పోస్టు ఇచ్చినా తీసుకోనని.. ఇక మళ్లీ పోస్ట్ మ్యాన్ కాదలచుకోలేదన్నారు వెంకయ్య నాయుడు.