రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని స్వామి వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. రాజేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ప్రీతికరమైన ‘కోడె మొక్కు’ నైవేద్యాలు సమర్పించారు. అంచనాలకు విరుద్ధంగా, శ్రావణ మాసం మొదటి రోజున యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. జులై 29 నుంచి ఆగస్టు 28 వరకు జరిగే ఈ నెల రోజుల ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
Also Read : Kichcha Sudeep: 50 ఏళ్ల వయస్సులో ఆ బాడీ ఏంటీ సామీ..
భక్తులు పుట్టు వెంట్రుకలు సమర్పించి, అభిషేకాలు జరిపించుకుని, కుంకుమార్చన నిర్వహించుకుని, శివకళ్యాణం, చంఢీయాగం, అన్నపూజలు, పల్లకి సేవ, పెద్ద సేవ లాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. భక్తులు గంటల తరబడి లైన్‌లో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్టా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెలలో అన్ని సోమవారాల్లో శివుడికి ప్రత్యేక ‘రుద్రాభిషేకాలు, మహా లింగార్చన’ నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అన్ని శుక్రవారాల్లో రాజేశ్వరి దేవి, శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజలు కూడా నిర్వహించనున్నారు. స్వామివారి దర్శనానికి మూడు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు చండీ హోమం, కుంకుమ పూజలు, గండదీపం మొక్కులు, సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు.
Also Read : యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన ప్రత్యక్ష ప్రసార వీడియోలు మీ కోసం