NTV Telugu Site icon

Vemula Prashanth Reddy : సింగరేణి సంస్థపై అదానీకి కన్ను పడింది

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

బెల్లంపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన మూడు రోజులకే విదేశీ పర్యటనలు ఉన్న రేవంత్ రెడ్డిని అదానీ భేటీ అయి పెట్టుబడులు పెడతానంటూ సమావేశం ఏర్పాటు చేయడం, వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. సింగరేణి సంస్థపై అదానికి కన్ను పడిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద మోకరిల్లి తన కేసులు రద్దు చేసుకోవాలని తన గురువు పై ఉన్న కేసులను రద్దు చేసుకోవాలని రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి కార్మికులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి .మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అని, రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో పార్టీని పార్టీ కార్యకర్తలని పట్టించుకోలేదని వాస్తవాన్ని అంగీకరిస్తున్నామన్నారు. కొన్ని పథకాలు తమ కొంపముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను నాయకులను భాగస్వామ్యం చేయకుండా అంతా ఆన్లైన్లోనే నడిపించడం కూడా తమ పార్టీ ఓటమికి కారణమైందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ జోడోయాత్ర చేస్తుంటే ఇండియా కూటమి నేతలు ఆ కూటమిని చోడో చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే.. అంతకుముందు మంచిర్యాలలో ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 రోజుల్లో 14 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. ఏ పత్రిక లు , గొట్టాలు అయినా చూపించాయా అంటూ మీడియాపై ప్రశాంత్‌ రెడ్డి అక్కసు వెల్లబుచ్చారు. ప్రజలని కలవడం లేదు, అప్పులు చేశాడు అని మీడియా కేసీఆర్ పై అప్పుడు అబద్ధపు ప్రచారాలు చేసిందని, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉద్యమానికి వ్యతరేకంగా పని చేసిన పత్రికలు, గొట్టాలు ఇప్పుడు మూగ బోయాయా అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కలుస్తున్నాడా…రుణ మాఫీ చేశాడా అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు రాయడం లేదు ఎందుకు చూపించడం లేదు అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments