MLA Vemireddy Prashanthi Reddy Slams YS Jagan: మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ సైంధవుడిలా రాష్టాభివృద్ధిని అడ్డుకుంటుంటే.. అనిల్ కుమార్, ప్రసన్న కుమార్ రెడ్డిలు నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని విమర్శించారు. తల్లిని, చెల్లిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగం అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఇటీవల మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Somireddy Chandra Mohan Reddy: వైఎస్ జగన్ ఓ మంచి బాలుడు, గుణవంతుడు.. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎద్దేవా!
‘తప్పు చేసిన వాళ్లను సమర్ధించడం నాయకుడి లక్షణం కాదు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించి వైఎస్ జగన్ తన స్థాయి దిగజార్చుకున్నారు. 500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలన్న పీవీఆర్ ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసి కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పీవీఆర్‌ని విమర్శించడం భావ్యమా?. అనిల్, ప్రసన్న లాంటి అచ్చోసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రజలు ఛీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా.. వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు. మీ తల్లో, చెల్లో, ఆవిడో రాజకీయాల్లోకొచ్చి.. వాళ్లపై ప్రత్యర్ధులు నీలా నోరుపారేసుకుంటే ఊరుకుంటారా?. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు ఆకర్షితులై.. వైసీపీ నేతలు టీడీపీ వైపు క్యూ కడుతున్నారు’ అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
