వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ ప్రస్తానానికి సంబంధించి ఈరోజు కీలక ప్రకటనన చేసే అవకాశం ఉంది. వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు.. తీవ్ర మనస్థాపానికి గురైన వేమిరెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగా ఉంటున్నారు. ఇదే సమయంలో తన సన్నిహితులు.. మద్దతుదారులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. వేమిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని గుర్తించిన టీడీపీ నేతలు ఆయనతో సమావేశమై తమ పార్టీలోకి రావాలని కోరారు. మాజీ మంత్రి నారాయణతో పాటు పలువు నేతలు ఆయనతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.
Read Also: Stock Market Opening: చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్.. తొలిసారిగా 22,248కి చేరిన నిఫ్టి
ఇక, టీడీపీలోకి వస్తే నెల్లూరు లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం నెల్లూరుకు వచ్చిన ఆయన సన్నిహితులతో భేటీ అయ్యారు. రెండు, మూడు రోజులు తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన వారితో చెప్పినట్టు తెలిసింది. నిన్న చెన్నైకి వెళ్ళిన వేమిరెడ్డి ఈరోజు నెల్లూరుకు రానున్నారు.. ఇవాళ మరోసారి తన మద్దతు దారులతో సమావేశమై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Also: Fali S Nariman: సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయనిపుణుడు నారిమన్ కన్నుమూత..
అయితే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ సూచించడంతో ఆయన అందుకు అంగీకరించారు. కానీ కావలి, నెల్లూరు సిటీ ఉదయగిరి, నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను మారిస్తే తనకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అధిష్టానానికి నివేదించినా.. వారు స్పందించలేదు. ఇదే సమయంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట లోక్ సభ అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసింది. ఆయన స్థానంలో గట్టి నేతను బరిలోకి దించాలని ప్రభాకర్ రెడ్డి భావించినా.. ఆయనకు కనీస సమాచారం లేకుండా డిప్యూటీ మేయరుగా ఉన్న ఖలీల్ ను అధిష్టానం ఎమ్మెల్యగా ప్రకటించింది.. దీంతో తీవ్ర కలత చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. తన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు చెబుతున్నారు.