Site icon NTV Telugu

AP Elections 2024: మాకు మద్దతివ్వండి.. కేంద్రం నుంచి మరన్ని నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం..

Narayana

Narayana

AP Elections 2024: వచ్చే ఎన్నికల్లో అందరూ టీడీపీకి మద్దతు ఇవ్వాలి.. రాష్ట్రంలో టీడీపీ కూటమి.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుంది.. కేంద్రం నుంచి మరన్ని నిధులను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు నెల్లూరు లోక్‌సభ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ ఏసీ కూరగాయల మార్కెట్లో నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థి నారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల్లూరు మార్కెట్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం అన్నారు. హోల్ సేల్ వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తాం.. వచ్చే ఎన్నికల్లో అందరూ టీడీపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. స్టార్‌లకు దక్కని చోటు!

ఇక, నెల్లూరు సిటీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు మార్కెట్లో నీటి సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. మార్కెట్‌లోని వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. వ్యాపారుల సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే అభివృద్ధి అవసరం అన్నారు. మన రాష్ట్రంలోని వ్యాపారులంతా పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు.. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకపోవడమే కారణం అన్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి రాగానే నెల్లూరు ను స్మార్ట్ సిటీగా మారుస్తాం అని ప్రకటించారు నారాయణ.

Exit mobile version