NTV Telugu Site icon

Vellampalli Srinivas: టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు..!

Vellampally

Vellampally

Vellampalli Srinivas: విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌పై రాయి దాడి ఘటన కలకలం రేపుతోంది.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమా దాడి చేయించాడు అంటూ సంచలన ఆరోపణలు చేవారు.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రకి మంచి స్పందన వచ్చింది. కానీ, సీఎం జగన్ ని హతమార్చడానికి టీడీపీ ప్లాన్ చేసింది.. రాయితో దాడి చేసి హతమార్చాలి అనుకున్నారని విమర్శించారు. కోడి కత్తి, గులకరాయి అంటూ టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. మేమే కావాలని దాడులు చేపించుకున్నాం అని వ్యగంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు, బొండా ఉమా జూన్ 4న మీ అంతు చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు. నేను, కేశినేని నాని రౌడీలతో దాడి చేపించుకున్నామని బొండా ఉమా అంటున్నాడు. డబ్బులు ఇవ్వలేదు, అన్నా క్యాంటిన్‌ తీసేసారని సతీష్ అన్నాడని బొండా ఉమాకి ఎలా తెలుసు.? అని ప్రశ్నించారు.

ఇక, బొండా ఉమా తాగి మాట్లాడుతున్నాడు.. అధికారులను బెదిరిస్తున్నాడు.. కాబట్టి ఎన్నికల కమిషన్ సుమోటాగా కేసు ఫైల్ చేయాలని సూచించారు వెల్లంపల్లి.. సతీష్ అనే వ్యక్తి సీఎం మీద దాడి చేసిన సంగతి నిజం. బొండా ఉమా అనే దరిద్రం పోవాలని టీడీపీ నాయకులే అనుకుంటున్నారు. నిన్ను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు అవసరమా? అని ప్రశ్నించారు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు బయపడుతున్నావు.. చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమా దాడి చేయించాడని ఆరోపించారు. సతీష్ అనే వ్యక్తి మా నాయకుడేనని నిసిగ్గుగా చెప్పిన వ్యక్తి బొండా ఉమా అంటూ ఫైర్‌ అయ్యారు, ఎస్సీ, బీసీలను రౌడీలు, గుండాలగా టీడీపీ తయారు చేస్తున్నారు. తాగడం, తినడం మాత్రమే బొండా ఉమాకి తెలుసు. 100 శాతం చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమా టీం జగన్ హత మార్చాలని ప్లాన్ వేశారని సంచలన ఆరోపణలు చేశారు.. బొండా ఉమా భూములు కబ్జా, ఆయన కొడుకులు బైక్ తో మనుషులని చంపిస్తాడు,సెక్స్ రాకెట్ లో బొండా ఉన్నాడని విమర్శించారు.. ఇక, కేసులో ఆధారాలు ఉంటే బొండా ఉమని A1 అయినా పెడతారు.. జూన్ 4 తర్వాత జగన్ మళ్లీ సీఎం అయ్యాక ఈ దాడి మీద పూర్తి విచారణ చేస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.

Vellampalli Srinivas Serious Comments On Chandrababu Naidu And Bonda Uma | Ntv