Velampalli Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. సీట్ల మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చిందంటే చాలు.. సీటు మార్పు ఖాయమనే చర్చ సాగుతోంది.. అంతే కాదు.. కొందరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో, మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఇలా చాలా మందినిలో టెన్షన్ నెలకొంది.. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎంవోకు వచ్చారు.. వెల్లంపల్లికి టిక్కెట్ ఉండదని ప్రచారం జరుగుతోన్న సమయంలో.. ఆయన సీఎంవోకు రావడం చర్చగా మారింది..
Read Also: Prashanth Neel: నా మూడు సినిమాలు నాకు నచ్చలేదు.. సలార్ కు అందుకే భయపడుతున్నాను
ఇక, ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన సీటు మార్పు వ్యవహారంపై స్పందించారు. నాకు సీటు లేదని, సీటు మారుస్తున్నారని రకరకాల ప్రచారం చేస్తున్నారు.. నా సీటు మార్పుపై అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి క్యాంప్ ఆఫీసుకి నేను, మేయర్ రెండు రోజులు క్రితం వెళ్లాం.. సీటు మార్పు గురించి.. నా దగ్గర ఇప్పటివరకు అధిష్టానం ప్రస్తావించలేదన్నారు. అయితే, నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గ నుండి మళ్లీ పోటీ చేస్తా.. విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారనేది ప్రచారం మాత్రమే నంటూ కొట్టిపారేశారు. నేను పార్టీకి రాజీనామా చేశానని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను సీఎం వైఎస్ జగన్‌ను నమ్ముకున్న వ్యక్తిని.. జగన్ ఏం చెప్పినా.. చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. అంతేకాదు.. విజయవాడ మూడు నియోజకవర్గాలతో పాటు, ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
