NTV Telugu Site icon

Tomato Prices: టమాటా ధరలపై కూరగాయల విక్రేత కన్నీళ్లు.. వీడియో షేర్‌ చేసిన రాహుల్ గాంధీ

Vegetable Vendor

Vegetable Vendor

Vegetable vendor in tears over soaring tomato prices, Rahul Gandhi shares video: భారతీయ మార్కెట్‌లలో టమాటా ధరలు మండిపోతుండగా.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల విక్రయదారుడు కన్నీళ్లు పెట్టిన వీడియో సామాన్య ప్రజలను కూరగాయల ద్రవ్యోల్బణం ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో వెలుగులోకి తెచ్చింది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఉన్న విపరీతమైన టమాటా ధరలను భరించలేక కూరగాయల విక్రేత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసిన వారి హృదయాలను కదిలిస్తోంది.

టమాటాలు ధరలు చాలా పెరిగాయని, వాటిని కొనుక్కోవడానికి కూడా తన దగ్గర సరిపడా డబ్బులేదని కూరగాయల విక్రేత రామేశ్వర్‌ కంటనీరు పెడుతూ చెప్పాడు. జహంగీర్ పురిలో నివసించే కూరగాయల విక్రేత, తన రిటైల్ దుకాణం కోసం టమాటాలు కొనడానికి తన కొడుకుతో కలిసి మార్కెట్‌కు చేరుకుని అక్కడ ధరలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాము ఆ కూరగాయలు ఏ ధరకు అమ్మాలా కూడా మాకు తెలియదని, వర్షంలో తడిసినా, ఏదైనా జరిగినా తాము నష్టపోతామని ఆయన బాధపడ్డారు. ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయని ఆయన అన్నారు. కూరగాయలు ధరలు పెరగడం తనను నిరాశా నిస్పృహలకు గురి చేసిందని, రోజుకు రూ. 100-200 కూడా సంపాదించలేనని విక్రేత పేర్కొన్నాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చను సృష్టించింది. ఈ వీడియో చాలా మంది సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిని చూపిస్తోంది.

Also Read: Bholaa Shankar: ‘భోళా శంకర్‌’లో ప్రధాన ఆకర్షణగా అన్నా చెల్లెళ్ళ బాండింగ్

వైరల్ వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్నారని అన్నారు. “ఒకవైపు అధికారాన్ని కాపాడుకున్న శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు. వారి సూచనల మేరకు దేశ విధానాలు తయారు చేయబడుతున్నాయి. మరోవైపు సాధారణ భారతీయులకు కూరగాయలు వంటి ప్రాథమిక వస్తువులు కూడా అందకుండా పోతున్నాయి. ధనిక, పేదల మధ్య పెరుగుతున్న ఈ అంతరాన్ని మనం పూడ్చాలి. ఈ కన్నీళ్లను తుడవాలి’ అని రాహుల్ గాంధీ అన్నారు.

వీడియోను పంచుకున్న నటుడు
నటుడు విజయ్ వర్మ కూడా తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను పంచుకున్నారు. బాధిత కూరగాయల విక్రేతకు సహాయం అందించాలని ఉందన్నారు. ఆయన లాంటి చిన్న అమ్మకందారులకు సహాయం అందించడానికి ఏదైనా మార్గం ఉందో చెప్పాలని ఆయన ట్విట్టర్ వేదికగా నెటిజన్లను అడిగారు. “ఇది హృదయ విదారకంగా ఉంది. అతనికి, అతనిలా జీవనోపాధిని కోల్పోయిన వారికి సహాయం చేసే మార్గం ఏదైనా ఉందా? ప్లీజ్ బతావో” అని నటుడు ట్వీట్ చేశారు.

టమాటా ధర పెంపు
ఇటీవలి వారాల్లో 440 శాతానికి పైగా పెరిగిన టొమాటో ధరల పెరుగుదల, విక్రేతలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత తీవ్రతరం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లోని అంగళ్లు హోల్‌సేల్ మార్కెట్‌లో, ఫస్ట్‌గ్రేడ్ టమాటా ధర శుక్రవారం 200 రూపాయలకు చేరుకుంది.