Andhra Pradesh: ఏపీలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పారుపూడి కనక చింతయ్య సమేత శ్రీ వీరమ్మ తల్లి పేరంటాల మహోత్సవ వేడుకలు గత 11 రోజులుగా ఉయ్యూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన వీరమ్మ తల్లి సిడి బండి బండి మహోత్సవం వేడుక కన్నుల పండుగ ఉయ్యూరు పట్టణంలో గురువారం కొనసాగింది. వేలాది మంది భక్తుల కోలాహలం, యువకుల నృత్యాలతో డప్పు దరువుల నడుమ సాగిన సిడి బండి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.
Read Also: Ambati Rambabu: పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
ఆనవాయితీగా భక్తులు సిడి బండికి అరటికాయలు విసిరేసి భక్తిని చాటారు. అనంతరం వీరమ్మ తల్లి ఉయ్యాల మండపం వద్ద సిడి ఆడించి ఆలయానికి సిడి బండి చేరుకొని మూడు ప్రదక్షిణలు నిర్వహించారు.దీనికి తోడు ఉయ్యూరు దళితవాడకు చెందిన ఉయ్యూరు వంశానికి చెందిన ఉయ్యూరు కృష్ణఫర్ కుమారుడు ఉయ్యూరు అనుపమ్ (ఈ ఏడాది వివాహం చేసుకున్నందుకు పసుపు కుంకుమలు పుచ్చుకున్న వరుడు ) ను పోలీసు బందోబస్తు నడుమ ఊరేగింపుగా తోడుకొని ఉయ్యూరు ప్రధాన సెంటర్ కు తీసుకురాగా.. అక్కడినుంచి సందడిగా ఆలయంకు చేరుకున్న కావలసిన వసతులు కల్పించి ఆలయం ఎదుట సిడి బండి బుట్టలో కూర్చుండబెట్టి సిడి ఆడించారు.ఈ సందర్భంగా భక్తులు కోర్కెలను తీర్చాలని కోరుతూ అరటికాయలు విసిరేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ మహోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నవరం డీఎస్పి జయసూర్య ఆధ్వర్యంలో ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, ఆత్కూరు, హనుమాన్ జంక్షన్ సర్కిల్లోని సీఐలు ఎస్సైలు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉయ్యూరు పట్టణ సీఐ హబీబ్ భాష, పట్టణ, రూరల్ ఎస్సైలు గణేష్ కుమార్, అవినాష్‌లు పర్యవేక్షించారు.