NTV Telugu Site icon

VeeraSimhaReddy : ‘మా బావ మనోభావాలు’ సాంగ్‎తో అభిమానుల వద్దకు బాలయ్య

Balayya Babu

Balayya Babu

Veera Simha Reddy : బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్‎లో ఉన్నారు. కారణం నటసింహం తాజా చిత్రం వీరసింహారెడ్డి నుంచి ఇటీవల రిలీజైన సుగుణ సుందరి పాట ఓ రేంజ్లో దూసుకుపోతుంది. రికార్డు స్థాయిలో ఈ మాస్ బీట్ వ్యూస్ ను రాబడుతోంది. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు బాలయ్య. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి. అవుట్‌ అండ్ అవుట్ మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్‌’ ఫేం గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ‘క్రాక్‌’ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్యతో సినిమా చేయనుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా మేకర్స్‌ మరో బిగ్‌ అప్డేట్‌ను ప్రకటించారు.

Read Also: చిక్కటి అందాలను చక్కగా ప్రదర్శిస్తోన్న నిక్కి తంబోలి

ఈ సినిమా కోసం తమన్ ‘మా బావ మనోభావాలు’ అనే పాటను స్వరపరిచాడు. ఈ పాటను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ పాటను కూడా బాలకృష్ణ – శ్రుతి హాసన్ బృందంపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ కథలో, ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. ఇక ఒక ముఖ్యమైన పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ పోషించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.