Site icon NTV Telugu

Bharath Jodo Yatra : బ్యానర్‌పై సావర్కర్‌ బొమ్మ.. ఖంగుతిన్న కాంగ్రెస్‌ నేతలు

Bharath Jodo Yatra

Bharath Jodo Yatra

కొచ్చి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది. కొచ్చిలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలతో స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వినాయక్ వీర్ సావర్కర్ చిత్రం కూడా ఉంది. అయితే.. స్వాతంత్ర్య సమరయోధుడు దిగ్గజం సావర్కర్‌ నిజానికి కాంగ్రెస్‌ ప్రత్యర్థి. అయితే కాంగ్రెస్‌ నేతలు విషయం తెలియగానే సావర్కర్‌ బొమ్మపైన గాంధీ ఫొటోను పెట్టారు. అయితే, దీనిని ప్రింటింగ్ మిస్టేక్‌గా పేర్కొన్న కాంగ్రెస్, సమగ్ర విచారణ జరుపుతుండగా స్థానిక నాయకుడిపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

 

ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్ వర్సెస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ గా మారింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, రాహుల్ గాంధీ గురువారం (సెప్టెంబర్ 22) 15వ రోజు భారత జోడో యాత్రను కొచ్చిలోని పరంబయం జామ మసీదు నుంచి ప్రారంభించారు.

 

Exit mobile version