Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు. అవసరమైన పరీక్షలు పూర్తి చేసి రాష్ట్ర సర్కారు వివరాలు అందించకపోవడం వల్లే కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆలస్యం అవుతోందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు.
“కాళేశ్వరం కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాను. నా దగ్గర ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశాను. NDSA రిపోర్ట్ అంశాన్ని కమిషన్ చీఫ్ నాతో మాట్లాడారు. ప్రాజెక్టులో గుంతలను స్టేట్ ఇంజనీర్లు పూడ్చడంతో జియోటెక్నికల్, జియోగిజికల్ డేటా కోల్పోయాం. జియోఫీజికల్ టెస్టుల కోసం NDSA రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు వివరాలను అడిగితే అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. NDSA అడిగిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే NDSA నివేదిక ఆలస్యం అవుతుంది.” అని కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు.
Read Also: TG High Court: మాగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం
ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రగోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నిజాలు దాచినా? నిజాలను బైపాస్ చేసినా? మేము బయటకు తీస్తాం. నిజాలను దాచి – బైపాస్ చేసే ప్రయత్నం చేస్తే నేనే స్వయంగా చర్యలు తీసుకుంటా. జరిగిన- చూసిన – చేసిన పనిని గురించి చెప్పడానికి ఎందుకంత బయం బైపాస్ చేస్తున్నారు ఎలా మర్చిపోతారు. రాష్ట్రస్థాయిలో జరిగిన విషయాలను కేంద్రంపై బకెట్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు. అఫిడవిట్‌లో చెప్పిన – చేర్చిన అంశాలు ఫీల్డ్‌లో కనిపించడం లేదు.ఇంజనీర్లు డెడికేషన్ తో పనిచేస్తే ఎందుకు బ్లాకులు కొట్టుకు పోయాయి.” అని ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది.