Site icon NTV Telugu

VC Sajjanar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఈ ఇన్‭ఫ్లూయెన్సర్లను ఏం చేయాలి?

Sajjanar

Sajjanar

VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎమ్‭డిగా పనిచేస్తున్న విసీ సజ్జనార్ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆయన విశేషాలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజలలో బెట్టింగ్ యాప్స్ పై అవగహన కోసమై పలు కీలక పోస్టులను చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితంలో నాశనం చేసుకోవద్దని ఆయన పలుమార్లు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతూనే.. మరోవైపు సోషల్ మీడియా ఇన్‭ఫ్లూయెన్సర్లకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ట్రావెలింగ్ ఇన్‭ఫ్లూయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేస్తూ మరోమారు బెట్టింగ్ యాప్స్ సంబంధించి సూచనలు చేశారు.

Also Read: HP: పెట్రోల్ పంపులో ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు

తాజాగా ఆయన షేర్ చేసిన వీడియోను ఉద్దేశించి.. ” చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో, అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట అని తెలుపుతూ ఫైర్ అయ్యారు. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి?, ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదని ఆయన అన్నారు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి అంటూ మరోమారు ఆయన ప్రజలకు బెట్టింగ్ యాప్స్ ఫై అవగహన ఇచ్చారు.

Exit mobile version