Site icon NTV Telugu

VC Sajjanar : సరిహద్దుల్లో ఉద్రిక్తత.. కొత్త దందాకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు

Sajjanar

Sajjanar

VC Sajjanar : దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సైబర్ నేరగాళ్లు తమ దందాను పెంచుకోవడానికి అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ అమాయక ప్రజలకు సందేశాలు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన.. కొందరు మోసగాళ్లు ఆర్మీ అధికారులమని నమ్మబలుకుతూ ప్రజలకు డొనేషన్ల కోసం మెసేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారని, దీనిని నమ్మి చాలా మంది డబ్బులు చెల్లిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన సీపీ సజ్జనార్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Operation Sindoor Effect: భారత్ దెబ్బకు అడుక్కుతినే పరిస్థితిలో పాకిస్తాన్..?!

ఎవరైనా ఆర్మీ అధికారి పేరుతో డొనేషన్ అడిగితే వెంటనే అనుమానించాలని, ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. దేశభక్తిని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి విరాళాలు ఇవ్వాలన్నా అధికారిక ప్రకటనలు చూసి, ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండటం ద్వారా ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు.

Exit mobile version